నేను నటిని.. కంటెంట్ క్రియేటర్‌ని కాదు: శివాత్మిక రాజశేఖర్

  • ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతిభ ఉండాలన్న శివాత్మిక
  • 'దొరసాని'లో నటన వల్లే తనకు 'రంగమార్తాండ'లో అవకాశం వచ్చిందని వెల్లడి
  • సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని విమర్శ

ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తె శివాత్మిక ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... నెపోటిజం, సినిమా అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజశేఖర్ కూతురిగా దర్శకులను కలిసే అవకాశం తనకు సులభంగా రావొచ్చు కానీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలమని ఆమె స్పష్టం చేసింది. తనకు 'రంగమార్తాండ'లో అవకాశం రావడానికి 'దొరసాని'లోని తన నటనే కారణమని గుర్తు చేసింది.


తాను రాజశేఖర్ కూతురిని అని తెలిసి కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి తనను తప్పించారని, దానికి కారణం తనకంటే మరొకరికి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటమేనని వెల్లడించింది. "నేను ఒక నటిని, కంటెంట్ క్రియేటర్‌ని కాదు. ఒక పాత్రకు నటి సెట్ అవుతుందా లేదా అని చూడాలి కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూసి అవకాశాలు ఇవ్వడం ఏంటి?" అని ఆమె పరిశ్రమ తీరును ప్రశ్నించింది.

Shivathmika Rajashekar
Shivathmika
Rajashekar
Jeevitha
Rangamarthanda
Dorasaani
Tollywood
Nepotism
Movie opportunities
Social Media Followers

More Telugu News